శ్రీశైలంకు మళ్లీ వరద..మూడు గేట్ల ఎత్తివేత

srisailam-dam

శ్రీశైలం: శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద వస్తుంది. దీంతో ఈరోజు ప్రాజెక్టు మూడు గేట్లను పది అడుగులమేర ఎత్తివేసి, దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయానికి 1,48,385 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. దిగువకు 86,485 క్యూసెక్కుల వదులుతున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, పూర్తిస్థాయిలో 885 అడుగులకు నీటిమట్టం చేరింది. నీటి సామర్థ్యం 215 టీఎంసీలకుగాను అదే మొత్తంలో నీరుంది. దీంతో ప్రాజెక్టుకు వరద వస్తుండడంతో మూడు గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/