దేశంలో కొత్తగా 12,249 కరోనా కేసులు

యాక్టివ్​ కేసులు.. 81,687

న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోజువారీ కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం కొత్తగా 12,249 మంది వైరస్​ బారినపడగా.. మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారినుంచి 9,862 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.62 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.17 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 3.94 శాతంగా ఉంది.

భారత్​లో మంగళవారం 12,28,291 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,96,45,99,906 కోట్లకు చేరింది. మరో 3,10,623 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ప్రపంచదేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. ఒక్కరోజే 7,30,579 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 1,235 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 545,711,181 కు చేరింది. మరణాల సంఖ్య 6,343,455కు చేరింది. ఒక్కరోజే 562,676 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 52,15,68,313 గా ఉంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/