“రా రా రక్కమ్మ” అంటూ ఓ రేంజ్ లో స్టెప్స్ వేసిన శ్రీముఖి

“రా.. రా.. రక్కమ్మ” ఈ సాంగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. చిన్న పిల్లల దగ్గరి నుండి పెద్దవారి వరకు అంత ఈ సాంగ్ కు చిందులేస్తున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఈ సాంగ్ రీల్స్ దర్శనం ఇస్తుంటాయి. ఇప్పటివరకు ఎంతోమంది ఈ సాంగ్ స్టెప్స్ వేయగా..తాజాగా బుల్లితెర రాములమ్మ శ్రీముఖి తనదైన స్టయిల్ లో చించేసింది. ప్రస్తుతం ఈమె చేసిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారుతుంది.

ఇండస్ట్రీలో స్థిరపడాలన్న లక్ష్యంతో శ్రీముఖి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘జులాయి’తో నటిగా కెరీర్‌ను మొదలెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘నేను శైలజ’, ‘జెంటిల్‌మెన్’ వంటి చిత్రాల్లో అదిరిపోయే పాత్రలు చేసింది. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘బాబు బాగా బిజీ’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఫలితంగా టాలీవుడ్‌లో యమా పాపులర్ అయిపోయింది. ‘అదుర్స్’ షోతో హోస్టుగా మారిన ఆమె.. ఆ తర్వాత ‘అదుర్స్ 2’, ‘మనీ మనీ’, ‘సూపర్ మామ్’, ‘సూపర్ సింగర్’, ‘జోలకటక’, ‘కామెడీ నైట్స్’, ‘బొమ్మ అదిరింది’, ‘పటాస్’ వంటి షోలు చేసి తెలుగులో టాప్ యాంకర్‌గా వెలుగొందుతోంది. ఇక సోషల్ మీడియా లోను నిత్యం యాక్టివ్ గా ఉంటూ నెటిజన్లను తన గ్లామర్ తో కట్టిపడేస్తుంటుంది.