తెలంగాణ లో మరో మూడు నాలుగు రోజులపాటు వర్షాలే

తెలంగాణ రాష్ట్రంలో గత మూడు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. మరో మూడు , నాల్గు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలో అతి భారీ వర్షాలు , మరికొన్ని జిల్లాలో తేలికపాటి వర్షాలు పడనునట్లు వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ విభాగం పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

శుక్రవారం నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడుతాయని, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాపాతం నమోదయ్యే ఛాన్స్‌ ఉందని వివరించింది. భద్రాద్రికొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, వికారాబాద్‌తో భారీ వర్షాపాతం నమోదవగా.. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్‌ జంట నగరాలతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైందని టీఎస్‌డీపీఎస్‌ వివరించింది.