చంద్ర‌బాబుకు భ‌గ‌వంతుడు ఆశీస్సులు అందించాలి : ప‌వ‌న్

చంద్ర‌బాబు అపర భగీరథుడన్న దేవినేని ఉమ‌

అమరావతి : నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 73వ పుట్టినరోజు ఈ సంద‌ర్భంగా ఆయనకు ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా స్పందిస్తూ… ‘మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడి గారికి హృద‌యపూర్వ‌క జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. శ్రీ చంద్ర‌బాబు గారికి భ‌గ‌వంతుడు ఆశీస్సులు అందించి, సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాల‌ని ఆకాంక్షిస్తున్నాను’ అని ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

‘పట్టిసీమతో గోదావరి తల్లిని కృష్ణమ్మ చెంతకు చేయిపట్టి నడిపించిన అపర భగీరథుడు, దేశంలోనే మొదటి నదుల అనుసంధాన కర్త చంద్ర‌బాబు నాయుడి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అని టీడీపీ నేత దేవినేని ఉమా మ‌హేశ్వర రావు పేర్కొన్నారు.

గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి చంద్ర‌బాబు శ్రీ‌కారం చుట్టార‌ని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా, గొల్లపూడి వన్ సెంటర్ లో ఘనంగా చంద్ర‌బాబు నాయుడి పుట్టినరోజు వేడుకలు నిర్వ‌హించామ‌ని దేవినేని ఉమ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/