కరోనా కాలం: గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఆరోగ్యం -సంరక్షణ

Covid-19 period-precautions -pregnant
Covid-19 period-precautions -pregnant

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నుండి గర్భిణీ స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. స్త్రీలు గర్భం దాల్చినపుడు జరిగే మార్పులతో వారి ఊపిరితిత్తుల సామర్ధ్యం కొంత తగ్గుతుంది.

ఆక్సిజన్‌ మాములుకంటే ఎక్కువగా వినియోగమవుతుంది. వ్యాధినిరోధక శక్తి కూడా తగ్గుతుంది. అందువల్ల గర్భిణులు సహజంగానే శ్వాససంబంధ వ్యాధుల వల్ల కలిగే ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అయితే జాగ్రత్తలు పాటిస్తూ, అప్రమత్తంగా ఉంటే ఈ వైరస్‌ సోకకుండా చూసుకోవచ్చు. గర్భిణులు వెలుగు, గాలి చక్కగా వచ్చే గదిలో ఉండాలి. వీరికి టాయిలెట్‌ విడిగా ఉండాలి. శుభ్రమైన ఆహారం, మంచినీరు తీసుకోవాలి.

ఆరోగ్య సమస్యలేమైనా ఉంటే చికిత్స తీసుకునే ఏర్పాట్లు ఉండాలి. తల్లికి ఇన్ఫెక్షన్‌ ఉంటే బిడ్డకు వ్యాధి సంక్రమించదని, నెలలు నిండక ముందే ప్రసవం కావడం, శిశువుకు అంగవైకల్యాలు వచ్చే ప్రమాదం వంటివి కరోనా వైరస్‌తో ఉండవనీ పరిశోధకులంటున్నారు.

గర్భి ణులు తరచుగా సబ్బునీటితో చేతులు కడుక్కోవడం, ఆల్కహాల్‌ ఉన్న శానిటైజర్‌తో చేతుల్ని శుభ్రపరచుకోవడం చేస్తుండాలి.

దగ్గు, తమ్ములు ఉన్న వారికి తప్పకుండా దూరంగా ఉండాలి. కళ్లు, ముక్కు, నోటిని చేతితో తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్‌ సలహాలు, సూచనలు క్రమం తప్పకుండా పాటించాలి.

అవసరమైన చికిత్సలు ఉంటే చేయించుకోవాలి. ఉద్యోగినులైన గర్భిణులకు తక్కువ ప్రమాదం ఉన్న పనులిన కేటాయించాలి.

పధ్నాలుగు రోజుల పాటు ఇంటి నుండి పనిచేయడం, లేదా సెలవు తీసుకోవడం మంచిది. పరీక్షకోసం ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటే సాధ్యమైనంత త్వరగా పరీక్షలు నిర్వహించి వారిని ఇంటికి పంపించేయాలి.

అంతగా ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేకపోతే మందుల గురించి ఇతర విషయాల గురించి ఫోన్‌, వీడియోకాల్స్‌లలో డాక్టరును సంప్రదించాలి. ముఖాముఖిగా జరిపే యాంటీ నేటల్‌ తరగతులను వాయిదా వేసుకోవాలి.

గర్భిణులు ఆసుపత్రిలో ఉన్నప్పుడు దగ్గరి వారికి ఒకరి మాత్రమే అనుమతించాలి. ఆసుపత్రి నుండి మామూలు కంటే ముందుగానే డిశ్చార్జి చేయాలి.

ఇన్ఫెక్షన్‌ నుండి కోలుకున్న గర్భిణులలో యాంటీబాడీలు ఉత్పత్తి అయి, అవి చనుబాల ద్వారా బిడ్డకు చేరి రక్షణ లభిస్తుందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడయింది.

అందువల్ల బిడ్డకు తల్లిపాలు పట్టడమే మేలు. గర్భం, ప్రసవం గురించి మాములుగానే సందేహాలు, భయాలు ఉంటాయి.

ప్రస్తుతమున్న కరోనావ్యాపి సమయంలో అవి మరింతగా ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. కాని భయపడకుండా ధైర్యంగా ఉండాలి.

డాక్టర్లు సూచించే జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి. ఇలా చేస్తే కోవిడ్‌ బారి నుండి తప్పించుకోవచ్చు.

కాబోయే అమ్మలు జాగ్రత్తగా ఉంటే చక్కటి బిడ్డకు జన్మనిస్తారు. బిడ్డలకు ఎలాంటి వైరస్‌లు సోకుండా ఉండాలంటే గర్భంతో ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు పాటిస్తే కడుపులో బిడ్డ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటుంది.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/