షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు

జగన్ సర్కార్ ఫై వైస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైస్ షర్మిల ఈరోజు AP PCC చీఫ్ గా బాధ్యత చేపట్టింది. ఈ సందర్బంగా అధికార పార్టీ వైసీపీ తో పాటు టీడీపీ ఫై విమర్శలు చేసింది. కానీ ఎక్కువగా జగన్ ఫై విమర్శలు చేయడం ఫై వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. షర్మిల వ్యాఖ్యలపై ఒక్కరు స్పందిస్తూ వస్తున్నారు. తాజాగా వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

షర్మిల కాదు ఎవరు వచ్చిన తమ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయలేరన్నారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ అభివృద్ధి జరగలేదని చెప్పడానికి వాళ్ళేవారని ప్రశ్నించారు. రమ్మనండి ఛాలెంజ్ చేస్తున్నాం.. తమతో వస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపిస్తామని తెలిపారు. తెలంగాణలో రాజకీయాలు చేసి ఇప్పుడు ఆంధ్రాకు వచ్చి ఆమె మాట్లాడితే ఎలా అని దుయ్యబట్టారు. వైఎస్సార్ ఆశయాల కోసం పోరాడుతున్నది వైసీపీ అయితే, రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టింది సోనియా కాంగ్రెస్ అని ఆరోపించారు. ఢిల్లీ కాంగ్రెస్ లో చేరి మమ్మల్ని టార్గెట్ చేయడం ఎంత వరకు కరెక్టో షర్మిల సమీక్షించుకోవాలని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వంతో కాంప్రమైజ్ అయ్యామే తప్ప.. తాము ఎక్కడ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టలేదని పేర్కొన్నారు.