ఏపీలో అంగన్వాడీలు అరెస్ట్ చేస్తున్న పోలీసులు

గత కొద్దీ రోజులుగా ఏపీలో అంగన్వాడీలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో తమకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలంటూ..అలాగే పలు డిమాండ్స్ ను నెరవేర్చాలని నిరాహార దీక్షలు చేస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో రేపు (సోమవారం) అంగన్వాడీ కార్యకర్తలు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు రాష్ట్ర వ్యాప్తగా అంగన్వాడీలను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వామ పక్ష నేతలు, కార్మిక సంఘాల నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే సీపీఎం నేత బాబురావును హౌస్ అరెస్ట్ చేశారు.

కాగా.. నగరంలోకి వచ్చే వారిపై పూర్తి స్థాయి వివరాలు తెలుసుకుంటున్నారు. ఇక ధర్నా చౌక్ లో ఉన్న అంగన్ వాడీ వర్కర్ల టెంట్ దగ్గర పోలీసులు మోహరించారు. టెంట్ నుంచి ఎవరు బయటకి వచ్చినా అరెస్ట్ కు సిద్దంగా ఉన్నారు పోలీసులు. మరోవైపు.. రాజమమండ్రిలో విజయవాడకు వెళ్తున్న 29 మంది అంగన్వాడీలను రైల్వేస్టేషన్, బస్టాండ్లలో గుర్తించి నోటీసులు ఇచ్చి ఇంటికి పంపించారు. ప.గో జిల్లా పాలకొల్లులో బయలుదేరిన అంగన్వాడీలను రైల్వే స్టేషన్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. అంగన్వాడీలు పోలీస్ స్టేషన్ కు వెళ్లేందుకు నిరాకరించి రైల్వే స్టేషన్ లోనే బైటాయించారు.