కమలం గూటికి విజయశాంతి

జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో ఆమె ప్రాథమిక సభ్యత్వం

Vijaya Shanthi joined in BJP
Vijaya Shanthi joined in BJP

New Delhi: విజయశాంతి బీజేపీ గూటికి చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో ఆమె బీజేపీ ప్రాథమిక సభ్యత్వం తీసుకుని పార్టీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె తెలంగాణ ఆవిర్భావం కోసం తాను కేసీఆర్ కంటే ముందునుంచీ  పోరాడానని చెప్పారు. తాను స్థాపించిన తెలగాణ తల్లి పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయాల్సిందిగా కేసీఆర్ ఒత్తిడి తీసుకు వచ్చారని పేర్కొన్నారు. 

మొదటి నుంచీ కేసీఆర్ తన పట్ల కుట్రపూరితంగానే వ్యవహరించారని విజయశాంతి ఈ సందర్భంగా ఆరోపించారు.

తెలంగాణలో పెద్ద స్థాయిలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ఆ అవినీతి బాగోతాన్ని రానున్న రోజులలో బయటపెడతామని విజయశాంతి అన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/