షర్మిల ఫై సజ్జల ఫైర్..అసలు ఏం తెలుసు నీకు..?

వైస్ షర్మిల ఈరోజు AP PCC చీఫ్ గా బాధ్యత చేపట్టింది. ఈ బాధ్యత చేపట్టి చేపట్టగానే అధికార పార్టీ వైసీపీ ఫై నిప్పులు చెరిగారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి‌లో ఉందని , రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక, మైనింగ్‌ మాఫీయాలు రెచ్చిపోతున్నాయని , మూడు రాజధానులు అభివృద్ధి చేస్తామని రాష్ట్రంలో ఒక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయలేదని జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఈ విమర్శల ఫై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

షర్మిలను చూస్తే జాలి వేస్తుందని , వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎంతగా వేధించిందో అందరికీ తెలుసు.. అలాంటి పార్టీలో చేరగానే.. షర్మిల యాస, భాష మారాయి అని, తెలంగాణలో ఏం చేశారని ఏపీకి వస్తున్నారు..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉనికిలేని పార్టీ కాంగ్రెస్‌. ఇన్నాళ్లు తెలంగాణలో ఏం చేశారు? ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? 119 స్థానాల్లో ఎందుకు పోటీ చేయలేదు? చూస్తుంటే వైఎస్ షర్మిలను చంద్రబాబు తెచ్చకున్నట్లు కనపడుతోంది. జగన్ రెడ్డీ అనడం..ఆ భాష చూస్తే ఆశ్చర్యమేస్తుంది. షర్మిల వాడిన భాష సరికాదు. తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి.. ఇక్కడ అవకాశం లేదు పొమ్మంటే.. వైఎస్ షర్మిలను ఏపీలో నేను ఉపయోగించుకుంటా అని చంద్రబాబు తెచ్చుకున్నట్లు కనపడుతోంది. షర్మిల వ్యాఖ్యలు మా అందరికీ బాధ కలిగించాయి. కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసు? రాష్ట్రానికి, వైఎస్ఆర్ కుటుంబానికి కాంగ్రెస్ ఎంతో ద్రోహం చేసింది. జగన్ రెడ్డీ, నియంత అనడం.. ఈ భాష ఆశ్చర్యం కలిగిస్తోంది” అని వాపోయారు సజ్జల.