పోస్టల్ బ్యాలెట్ నిబంధన పై హైకోర్టుకు వైసీపీ

ap high court
ap high court

అమరావతి: రిటర్నింగ్ అధికారి సీల్ (స్టాంపు) లేకపోయినా సంతకం ఉంటే చాలని, అలాంటి పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాలను ఏపీ ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు పంపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిబంధనను అధికార వైసీపీ వ్యతిరేకిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ నిబంధనపై వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. బ్యాలెట్ పై ఆర్వో సీల్ లేకపోయినా ఓటును తిరస్కరించవద్దంటూ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా ఇచ్చిన మెమో సమంజసం కాదని వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు హైకోర్టు అంగీకారం తెలిపింది.