ముగిసిన TSRTC కార్మికుల నిరసన..రోడ్డెక్కిన బస్సులు

TS ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదం తెలుపకుండా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సైలెంట్ గా ఉండడం పట్ల ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఉదయం నుండి అన్ని డిపోల వద్ద నిరసన తెలిపారు. ఉదయం నుండి బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. ఉదయం 6.00 గంటలకు ప్రారంభమైన నిరసన కార్యక్రమం 8 గంటల వరకు కొనసాగింది. 8 తర్వాత బస్సులు రోడ్లపైకి వచ్చాయి. కార్మికుల నిరసనతో ఉదయం వేళ ఆఫీస్ లకు , స్కూల్స్ , కాలేజీల కు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు. రాజ్‌భవన్ వద్ద ఉదయం 11.00 గంటలకు మరోసారి నిరసన చేపట్టాలని టీఎంయూ నిర్ణయించింది. గ్రేటర్‌లోని కార్మికులు 10 గంటలకు నెక్లెస్ రోడ్డుకు రావాలని పిలుపునిచ్చింది.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదం తెలుపకుండా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సైలెంట్ గా ఉండడం పట్ల తెలంగాణ సర్కార్ ఆగ్రహంగా ఉంది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు కనుక పెట్టలేకపోతే.. శాసనసభ ఎన్నికలు పూర్తయ్యేవరకు వాయిదా పడినట్టే. వేలమంది జీవితాలతో ముడిపడి ఉన్న బిల్లుకు కీలక సమయంలో రాజ్‌భవన్‌ మోకాలడ్డటంపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహోదగ్రులవుతున్నారు.