వైస్సార్సీపీ పార్టీ అధ్యక్ష పదవికి విజయమ్మ రాజీనామా ఫై షర్మిల కామెంట్స్

వైస్సార్సీపీ పార్టీ అధ్యక్ష పదవికి వైస్ విజయమ్మ రాజీనామా చేసారు. ఈ విషయాన్నీ స్వయంగా ఆమెనే ప్లీనరీ వేదికగా ప్రకటించారు. దీనిపై విజయమ్మ కూతురు వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైస్ షర్మిల స్పందించారు. వైఎస్​ఆర్​టీపీ పార్టీ స్థాపించి నేటితో ఏడాది పూర్తీ చేసుకున్న సందర్బంగా షర్మిల మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో మీడియా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాదానాలు తెలిపిన ఆమె..వైస్సార్సీపీ పార్టీ అధ్యక్ష పదవికి విజయమ్మ రాజీనామా చేయడం ఫై మీ స్పందన ఏంటి అని అడుగా..ఆ ప్రశ్నకు సమాధానం దాటవేశారు.

ఇక వైస్సార్సీపీ ప్లీనరీ వేదికగా.. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కీలక ప్రకటన చేశారు. గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విమర్శలకు తావు లేకుండా తాను ఈ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సభ వేదికగా తెలిపారు. తెలంగాణలో షర్మిల ఒంటరి పోరాటానికి అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. విమర్శలకు తావు లేకుండా ఉండేందుకే పార్టీ నుంచి తప్పుకుంటున్నా. తెలంగాణలో షర్మిలకు అండగా ఉండేందుకే రాజీనామా. షర్మిల ఒంటరి పోరాటానికి అండగా ఉండేందుకే ఈ నిర్ణయం అని అన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకు జగన్‌తో ఉన్నా.. సంతోషం ఉన్నప్పుడు కూడా అండగా ఉంటే నా రక్తం పంచుకున్న బిడ్డ షర్మిలకు అన్యాయం చేసినదాన్ని అవుతానేమోనని నా మనస్సాక్షి చెబుతోంది. నా ఉనికి ఎవరికీ వివాదాస్పదం కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ విషయంలో నన్ను క్షమించాలి అని ఆమె అన్నారు.