30న ఏలూరులో వైసీపీ భారీ బహిరంగ సభ

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో ఏపీ అధికార పార్టీ వైసీపీ దూకుడు పెంచుతుంది. ఇప్పటికే అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఇచ్చిన జగన్..ఇక ఇప్పుడు వరుసగా బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో 30న ఏలూరులో వైసీపీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు.

తూర్పు, పశ్చిమ, కృష్ణా ఉమ్మడి జిల్లాల నుంచి లక్షలాది మందితో ఏలూరులో ఈ నెల 30 న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ వెల్ల‌డించారు.. ఈమేరకు రాజమండ్రిలో ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల నేతలతో బుధవారం సాయంత్రం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల వైసీపీ ముఖ్యనేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉభయగోదావరి జిల్లాల్లోని అయిదు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆయా కార్పోరేషన్లు ఛైర్మన్లు, పార్టీ ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.