‘పద్మ’ అవార్డుల్లో దక్షిణాదికి ప్రాధాన్యత

రిపబ్లిక్ డే సందర్బంగా కేంద్రం పద్మ అవార్డ్స్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డ్స్ లో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యం దక్కింది. ముఖ్యంగా పద్మవిభూషణ్ అవార్డు దక్కించుకున్న ఐదుగురిలో నలుగురు దక్షిణాది రాష్ట్రాల వారే కావడం విశేషం. మరోవైపు కేంద్రం పద్మభూషణ్ నలుగురికి, పద్మశ్రీ 24 కేంద్రం అందజేయనుంది. అవార్డు గ్రహీతల్లో ప్రజా వ్యవహారాలు, సామాజిక సేవ, కళల విభాగాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు.

ఈ ఏడాది మొత్తం 132 మందికి పురస్కారాలు ప్రకటించగా.. ఐదుగురికి పద్మ విభూషణ్‌, 17 మందికి పద్మభూషణ్‌, 110 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను బిహార్‌ జననాయక్‌, మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇక పద్మ అవార్డు గ్రహీతలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్, జగన్ అభినందనలు తెలిపారు. ఇరు రాష్ట్రాల నుంచి ఇద్దరికి పద్మవిభూషణ్, ఆరుగురికి పద్మశ్రీ అవార్డు వరించింది. అవార్డుకు ఎంపికైన వారికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు మాజీ సీఎం కేసీఆర్, జనసేనాని పవన్ వీరికి అభినందనలు తెలియజేశారు.