తెలంగాణ సచివాలయంలో జాతీయ పతాకవిష్కరణ గావించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

భారత 75 వ గణతంత్ర దినోత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ సచివాలయంలో జాతీయ పతాకవిష్కరణ గావించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి. అంతకు ముందు పబ్లిక్‌ గార్డెన్స్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గత BRS ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.

‘అహంకారం, నియంతృత్వ పాలనను రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. గత ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ వ్యవస్థలు విధ్వంసానికి గురయ్యాయి. ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. తెలంగాణ సమాజం ఇప్పుడు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. ప్రజాస్వామ్య స్పృహతో పాలన జరుగుతోంది’ అని పేర్కొన్నారు. ఇక గవర్నర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, అధికారులు స్వాగతం పలికారు. అలాగే పోలీసులు, సైనికుల నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించారు.