పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించిన సీఎం జగన్‌

ysrcp-plenary-2022-guntur

అమరావతిః గుంటూరు కాజాలో వైస్‌ఆర్‌సిపి ప్లీన‌రీ కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది. ఈకార్య‌క్ర‌మానికి త‌న త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మితో క‌లిసి హాజ‌రైయ్యారు సీఎం జ‌గ‌న్. వీరికి పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ప్లీనరీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి జగన్ నివాళి అర్పించారు. పార్టీ జెండాను ఎగురవేసి, ప్లీనరీని ప్రారంభించారు. ఈ సందర్బంగా సిఎం జగన్‌ మాట్లాడుతు..2009 సెప్టెంబర్‌ 25న పావురాల గుట్టలో మొదలైన సంఘర్షణ ఓదార్పు యాత్రతో పార్టీ ఒక​ రూపం దాల్చిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

వైఎస్సార్‌ ఆశయాల సాధన కోసం పార్టీ ఆవిర్భవించిందన్నారు. కోట్లాది మంది అభిమానులకు, ప్రజలకు సెల్యూట్‌ అని సీఎం అన్నారు. ఈ 13 ఏళ్లలో ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ‘‘మనపై ఎన్ని రాళ్లు పడ్డా, మనపై ఎన్ని నిందలు వేసినా ఎదుర్కొన్నాం. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని దాడులు జరిగినా గుండె చెదరలేదు. సంకల్పం మారలేదు. నాన్న ఇచ్చిన ఈ కుటుంబం ఏనాడూ నా చేయి వీడలేదు’’ అని సీఎం అన్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఘన విజయం సాధించాం. ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించిన మనకు ప్రజలు అధికారం కట్టబెట్టారు. ప్రతిపక్షాన్ని 23 ఎమ్మెల్యే సీట్లకు, 3 ఎంపీ సీట్లకు పరిమితం చేశాడు దేవుడు. అధికారం అంటే అహంకారం కాదని నిరూపించాం’’ అని సీఎం జగన్‌ అన్నారు. మరోవైపు భారీ సంఖ్యలో తరలి వచ్చిన పార్టీ శ్రేణులతో ప్రాంగణమంతా నిండిపోయింది.

తాజా జిబినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/