కరోనా బారినపడిన లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్

లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కరోనా బారినపడింది. దేశంలో కరోనా ఉదృతి భారీస్థాయికి చేరుతుంది. రోజు రోజుకు కొత్త కేసులు లక్షల్లో నమోదు అవుతుండడం తో సామాన్య ప్రజానీకమే కాకుండా సినీ , రాజకీయ , బిజినెస్ రంగాలవారు సైతం కరోనా బారినపడి చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా గాయని లతా మంగేష్కర్​ కూడా కరోనా బారినపడ్డారు. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు స్పల్ప లక్షణాలు ఉన్నాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు.

లతా మంగేష్కర్ గారికి స్వల్ప లక్షణాలున్నాయి. కానీ వయసు రీత్యా ముందు జాగ్రత్త కోసం మాత్రమే ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. దయచేసి మా గోప్యతను గౌరవించండి అంటూ ఆమె మేనకోడలు రచనా ట్వీట్ చేశారు. గతంలో 2019 నవంబర్ లో శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ లతా మంగేష్కర్ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో ఆమెకు ఐరల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు లతా మంగేష్కర్ చెల్లెలు ఉష తెలిపింది. 1929 సెప్టెంబర్ 28న జన్మించిన లతా మంగేష్కర్ భారత అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కె, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ సహా ఎన్నో అవార్డులను అందుకున్నారు . ఇండియన్ నైటింగల్‏గా పేరు సంపాదించారు. ఇప్పటివరకు 50వేలకు పైగా పాటలను ఆలపించడం జరిగింది.