ప్రియ మిత్రుడు షింజో అబేపై కాల్పులు బాధను కలిగించిందిః ప్ర‌ధాని మోడీ

Deeply distressed by attack on dear friend Shinzo Abe.. PM Modi

న్యూఢిల్లీః ప్ర‌ధాని మోడీ జపాన్‌ మాజీ ప్ర‌ధాని షింజో అబేపై జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌ను ఖండించారు. ప్రియ మిత్రుడు షింజో అబేపై అటాక్ జ‌ర‌గ‌డం తీవ్ర బాధ‌ను క‌లిగించింద‌ని మోడీ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. షింజో అబేతో పాటు ఆయ‌న కుటుంబం, జ‌పాన్ ప్ర‌జ‌ల కోసం ప్రార్థిస్తున్న‌ట్లు చెప్పారు. మరోవూపు మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ కూడా షింజో పై కాల్పులు షాక్ వ్య‌క్తం చేశారు. త‌న మిత్రుడుపై దాడి జ‌ర‌గ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. షింజో కుటుంబస‌భ్యుల త‌ర‌పున ప్రార్థిస్తున్న‌ట్లు మ‌న్మోహ‌న్ వెల్ల‌డించారు.

కాగా, నేడు ఉదయం జపాన్​ మాజీ ప్రధాని షింజో అబే పశ్చిమ జపాన్ నగరమైన నారాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సందర్భంగా ఆయన పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/