గ్రామ వాలంటీర్లకు హ్యాట్సాఫ్‌

వాలంటీర్లపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన విజయసాయి రెడ్డి

Vijayasai Reddy
Vijayasai Reddy

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి టిడిపి అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. గ్రామాల్లో నియమించిన వాలంటీర్లపై ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు చేశారు. ‘గ్రామ వాలంటీర్లెంత? వాళ్ల జీతాలెంత? పెళ్లి చేసుకోవాలంటే సంబంధం కూడా దొరకదని హేళన చేశాడు చంద్రబాబు. అప్రయోజకుడైన ఆయన పుత్రరత్నం నాలుగున్నర లక్షల మంది వాలంటీర్లలో ఒక్కరితో కూడా సరితూగలేడు. సీఎం జగన్ గారు అప్పగించిన బాధ్యతను సైనికుల్లా నిర్వర్తిస్తున్నారు. హాట్సాఫ్’ అంటూ విజయసాయిరెడ్డి ఓ ఫొటోను పోస్ట్ చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/