లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా

ఈరోజు నుంచి రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు

Parliament of India
Parliament of India

న్యూఢిల్లీ :పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే జేడీయూ ఎంపీ బైద్యనాథ్‌ ప్రసాద్‌ మృతికి సభ సంతాపం తెలిపింది. లోక్‌సభలో చర్చించేందుకు కాంగ్రెస్‌ పార్టీ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది. సభలో ఆ పార్టీ పక్ష నేత రంజన్‌ చౌదరి ఈ మేరకు నోటీసును స్పీకర్‌కు అందజేశారు. అలాగే, శివసేన, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఏఐఏంఐఎం, డీఎంకేలు కూడా వేర్వేరుగా నోటీసులు ఇచ్చాయి. ఢిల్లీ అల్లర్లపై మొత్తం 23 నోటీసులు అందడం విశేషం. దీంతో ఈరోజు మొదలైన రెండోవిడత పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో ఢిల్లీ అల్లర్లపై చర్చించే అవకాశం ఉంది. హోం మంత్రి అమిత్‌షా రాజీనామాకు కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. అనంతరం సభను మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్‌ వాయిదా వేశారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/