కోవిడ్ విధుల్లో వైద్యులు మరణిస్తే రూ.25 లక్షల పరిహారం

స్టాఫ్ నర్సులు మరణిస్తే రూ.20 లక్షలు

Medical staff-covid duties-File-
Medical staff-covid duties-File-

Amaravati: కరోనాతో మరణించిన వైద్య సిబ్బందికి ఏపీ ప్రభుత్వం పరిహారం నిర్ణయించింది. కరోనా విధులు నిర్వర్తిస్తూ వైద్యులు మరణిస్తే రూ.25 లక్షలు, స్టాఫ్ నర్సులు మరణిస్తే రూ.20 లక్షలు, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓలు మరణిస్తే రూ.15 లక్షలు, ఇతర వైద్య సిబ్బందికి రూ.10 లక్షలు పరిహారం అందించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాకుండా పీఎం గరీబ్ కల్యాణ్ యోజనకు అదనంగా ఈ మొత్తాన్ని అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కొవిడ్ విధుల్లో ఉన్నవారికే ఈ పరిహారం అని స్పష్టం చేసింది. తక్షణమే ఎక్స్‌ గ్రేషియా అందేలా జిల్లా కలెక్టర్లకు అధికారం అప్పగించింది. ఇతర ఇతర బీమా పరిహారాలు పొందినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్ గ్రేషియో అందజేస్తామని ప్రభుత్వం పేర్కొంది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/