అందుకు ఈ 20 జీవోలే సాక్ష్యం

vijay sai reddy
vijay sai reddy

అమరావతి: చంద్రబాబు నాయుడు తీరుపై మరోసారి వైఎస్సాఆర్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా ఘాటు విమర్శలు చేశారు. 2014-19 మధ్య 20 సార్లు టిడిపి ప్రభుత్వం పొడిగించిన పీడీ యాక్ట్‌ను, ఇప్పుడు రొటీన్‌గా మా ప్రభుత్వం పొడిగిస్తే..చంద్రబాబు ఆయన బ్యాచ్‌ ఎలా గుడ్డలు చించుకుంటున్నారో చెప్పేందుకు ఈ 20 జీవోలే సాక్ష్యం అంటూ ఇందుకు సంబంధించిన పత్రాలను పోస్టు చేశారు. రూ.10 లక్షల కోట్ల రియల్‌ ఎస్టేట్‌ సంపద హుష్‌ కాకి అవుతుందనే టెన్షన్‌ ముందు..చంద్రబాబుకు సంక్రాంతి పండుగ ఎంత అన్నారు. డబ్బుంటే ప్రతి క్షణం ఉత్సవమే అనేది చంద్రబాబు ..ఆయన వర్గీయుల ప్రగాఢ విశ్వాసమని..ఈ లోగా ఇటు వాళ్లను అటు పంపిస్తారు..తటస్థులను తెరపైకి తెస్తారని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. దేనికైనా సిద్దమే విజనరీ చంద్రబాబు అంటూ సెటైర్లు వేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/