ప్రపంచపు పొట్టి వ్యక్తి మృతి

Khagendra Thapa Magar
Khagendra Thapa Magar

ఖాట్మాండు: ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తి ఇకలేరు. న్యూమోనియాతో ఆరోగ్యం విషమించడంతో ఖాగేంద్ర థాసా మాగర్ (27) కన్నుమూశారు. ఖాగేంద్ర 2010వ సంవత్సరంలో ప్రపంచ అతిచిన్న వ్యక్తిగా గిన్నిస్ బుక్ రికార్డు నమోదు చేశాడు. అతని పొడవు 67.08 సెం.మీ (2.41 అంగుళాలు) 6కేజీలు బరువు. అయితే నేపాల్ కు చెందిన చంద్ర బహదూర్ డాంగి 54.6 సెం.మీ పొడవుతో ఖాగేంద్ర రికార్డు బ్రేక్ చేశాడు. కానీ డాంగి2015లో మరణించడంతో తిరిగి పొట్టి వ్యక్తి టైటిల్ ఖాగేంద్ర పేరు మీద నమోదు అయింది. ఖాగేంద్ర మృతి పట్ల పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/