నివర్‌ తుపాను..సిఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

మూడు జిల్లాలో ఏరియల్‌ సర్వే చేయనున్న సిఎం జగన్‌

cm jagan-aerial-survey

అమరావతి: నేడు సిఎం జగన్‌ నివర్‌ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఈనేపథ్యంలో ఆయన నేరుగా చిత్తూరు జిల్లాకు వెళ్లనున్నారు. అక్కడ నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్‌ఆర్‌, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వరద ప్రభావంపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం సిఎం తాడేపల్లికి తిరుగుపయనమవుతారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/