ఎంపి రఘురామకృష్ణరాజుకు వై-కేటగిరీ భద్రత

వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలతో ముప్పు ఉందని కేంద్రానికి ఫిర్యాదు చేసిన రఘురాజు

raghu ramakrishna-raju

అమరావతి: ఎంపి రఘురామకృష్ణరాజు కు వై-కేటగిరీ భద్రతను కేంద్రం కల్పించింది. ఈ సందర్భంగా రఘురాజు మాట్లాడుతూ.. తనకు వై-కేటగిరీ భద్రతను కల్పించినట్టు నిన్న రాత్రి తెలిసిందని చెప్పారు. ఈరోజు అధికారికంగా లేఖ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వై-కేటగిరీ కింద తనకు దాదాపు 10 మంది సెక్యూరిటీగా ఉండొచ్చని చెప్పారు. ప్రస్తుతం తన నియోజకవర్గంలో కరోనా కర్ఫ్యూ ఉందని… కర్ఫ్యూని సడలించిన తర్వాత వస్తానని తెలిపారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ తో మాట్లాడతానని అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలపై తాను ఇచ్చిన ఫిర్యాదులోని వాస్తవ పరిస్థితులను పరిశీలించిన తర్వాతే కేంద్రం భద్రతను కల్పించిందని చెప్పారు. తన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/