హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం

రాజధానితో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు..కేంద్రహోంశాఖ

andrapradesh high court
andrapradesh high court

అమరావతి: ఏపి రాజధాని అమరావతి అంశంపై కేంద్రప్రభుత్వం ఈరోజు హైకోర్టులో అఫిట్‌విట్‌ దాఖలు చేసింది. రాష్ట్ర రాజధాని అంశంతో కేంద్రానికి సంబంధం లేదని అఫిడవిట్ లో కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర రాజధానుల అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని తెలిపింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉండదని చెప్పింది. రాజధాని అంశంలో కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది. మరోవైపు మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఏపీ హైకోర్టు 10 రోజుల పాటు స్టేటస్ కో విధించిన సంగతి తెలిసిందే.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/