జనసేన పార్టీ లో చేరిన ఎంపీ బాలశౌరి

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో రాష్ట్రంలోని అన్ని పార్టీలలో వలసల పర్వం కొనసాగుతుంది. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ నుండి పెద్ద ఎత్తున నేతలు బయటకు వస్తున్నారు. తాజాగా ఎంపీ బాలశౌరి..జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు.

ఆదివారం మంగళగిరి పార్టీ ఆఫీస్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనకు పొత్తులో భాగంగా జనసేన నుంచి మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఈ సందర్బంగా బాలశౌరి మాట్లాడుతూ..ఇకపై తాను కూడా జనసేన కార్యకర్తనే అని అన్నారు ఎంపీ బాలశౌరి. రాజకీయ పార్టీ నడపడం చాలా కష్టమని అన్నారు. సినిమాల్లో తీసుకునే రెమ్యునరేషన్ తో పవన్ కళ్యాణ్ పార్టీ నడుపుతున్నారని పేర్కొన్నారు. ఇకపై తన రాజకీయ జీవితం పవన్ కళ్యాణ్ తోనే అని అన్నారు. జనసేన పార్టీ బలోపేతం కోసం అందరం కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.

సీఎం జగన్ తాను ఇప్పటి వరకు అసలు అబద్దాలు ఆడలేదు అని అనడమే పెద్ద అబద్దం అని ఎంపీ బాలశౌరి అన్నారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి ఆంధ్ర ప్రదేశ్ కు రాజధానిగా ఉండలని చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ హయాంలో ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి దూరంగా ఉందని ఆరోపించారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు పైసల్ కూడా రాలేదని అన్నారు. సీఎం జగన్ కు అభివృద్ధి చాలా దూరం ఉందని ఎద్దేవా చేశారు.