రేవంత్ రెడ్డితో పాటు ప్రమాణం చేసిన మంత్రులు

ministers-who-took-oath-along-with-telangana-cm-revanth-reddy

హైదరాబాద్‌ః తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ని ఈరోజు మధ్యాహ్నం 1.20 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత 1.04 గంటలకు అనుకున్నప్పటికీ ట్రాఫిక్ వల్ల సమయం కాస్త ఆలస్యం అయింది.

సీఎం రేవంత్ రెడ్డితో పాటు 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క మల్లు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నంప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి, జూపల్లి, దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, కొండా సురేఖలు ప్రమాణం చేశారు.

తెలంగాణ కేబినెట్ మంత్రుల జాబితా విడుదలైంది. ఇప్పటికే మంత్రుల జాబితాను గవర్నర్ తమిళిసైకి పంపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహలు, శ్రీధర్ బాబు, సీతక్క, కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సుదర్శన్ రెడ్డిలకు మంత్రి పదవులు దక్కాయి. రేవంత్ రెడ్డితో పాటు మరికాసేపట్లో మంత్రులుగా వీరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భట్టి విక్రమార్క డీప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.