TS ను TG మార్చడం వెనుక కారణం..

తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఆదివారం సీఎం రేవంత్ రెడ్డ్డి అధ్యక్షతన జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో TS ను కాస్త TG గా మార్చడం. దీని వెనుక కారణం ఏంటి అనేది మంత్రి పొంగులేటి క్లారిటీ ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు టీజీ అనే అప్రూవల్ ఇచ్చిందని, దానిని గత ప్రభుత్వం టిఎస్ గా మార్పు చేసిందని వివరించారు. తెలంగాణ టీజీ గానే ఉండాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు .మిగతా నాలుగు గ్యారంటీలను త్వరలోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు తో పాటు మంత్రులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ జీవన్ రెడ్డి, శ్రీ దామోదర రాజనర్సింహ,ఎమ్మెల్యేలు శ్రీ సుదర్శన్ రెడ్డి, శ్రీ రోహిత్ రావు, శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే శ్రీ ఏ. చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈనెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది.