TS కాదు TG నే తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు

ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరు గ్యారెంటీలలో మరో రెండు గ్యారంటీల అమలుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. అలాగే అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతంకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతే కాదు వాహనాల రిజిస్ట్రేషన్‌లలో టీఎస్‌ను కాస్త టీజీగా (TS -TG) మార్చాలని నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో కులగణన నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర చిహ్నంలో తెలంగాణ ఆత్మ, స్ఫూర్తి ప్రతిబింబించేలా మార్పులు చేయాలని నిర్ణయించారు. ఆరు గ్యారెంటీలపై లోతుగా చర్చించిన అనంతరం రెండు గ్యారెంటీల అమలుకు నిర్ణయం తీసుకున్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ గ్యారెంటీలను అమలు చేయాలని నిర్ణయించారు.

కేబినెట్ కీలక నిర్ణయాలివే..

తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పు,
వాహనాల రిజిస్ట్రేషన్లలో టీఎస్‌ను టీజీగా మార్పు,
రాష్ట్ర అధికారిక గీతంగా ‘జయ జయహే తెలంగాణ’,
రెండు గ్యారంటీల అమలుకు నిర్ణయం,
రాష్ట్రంలో కులగణన(Caste Census) చేయడం,
65 ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్‌ టెక్నాలజీ కేంద్రాలుగా అప్‌డేట్‌ చేయడం,
సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ఇచ్చి విడుదల చేయాలని నిర్ణయం.