టిడిపి నేతలంతా ఆక్రమించిన భూముల కోసమే ఉద్యమం

రాజధాని పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది

jakkampudi raja
jakkampudi raja

తాడేపల్లి: రాజధాని పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేయడంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా మూడు రాజధానులు ఏర్పాటు అంశం రాష్ట్రాల పరిధిలోదేనని కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జక్కంపూడి రాజా తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. రాజధానిపై తప్పుడు ప్రచారం చేస్తున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కళ్లు తెరవాలని విమర్శించారు.
టిడిపి నేతలంతా అమరావతి ప్రాంతంలో ఆక్రమించిన భూముల కోసమే ఉద్యమం చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని మండిపడ్డారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/