చంద్రబాబు అరెస్ట్ ఎఫెక్ట్ : టీడీపీ లోకి భారీగా వైస్సార్సీపీ నేతలు

చంద్రబాబు అరెస్ట్ చేసి వైస్సార్సీపీ పెద్ద తప్పు చేసిందా..అంటే అవుననే అంటున్నాయి రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల సమాయంలో ప్రతి పక్షపార్టీల నేతలు అరెస్ట్ లు కామనే కానీ మాజీ సీఎం ను అరెస్ట్ చేయించడం..అది కూడా ఆధారాలు లేని కేసులో అరెస్ట్ చేయడం అనేది తెలుగు ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. కనీసం బెయిల్ కూడా రానివ్వకుండా చేయడం..కేసుల మీద కేసులు పెడుతుండడం తో టీడీపీ శ్రేణులే కాదు యావత్ తెలుగు ప్రజలు కూడా తట్టుకోలేకపోతున్నారు. వైస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నిరసనలు తెలుపుతూ..పెద్ద సంఖ్యలో టీడీపీ లో చేరుతున్నారు.

ప్రకాశం జిల్లా గిద్దలూరులో టీడీపీలోకి పెద్ద సంఖ్యలో వైస్సార్సీపీ నేతలు చేరారు. గిద్దలూరు జెడ్పీటీసీ సభ్యుడు బుడతా మధుసూదన్ యాదవ్ తో పాటు మరో ముగ్గురు సర్పంచ్ లు, ముగ్గురు మాజీ సర్పంచ్ లు, పలువురు ఉపసర్పంచ్ లు, వార్డు సభ్యులు, పలు గ్రామాల నాయకులు మూకుమ్మడిగా టీడీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జీ అశోక్ రెడ్డి సమక్షంలో వీరు టీడీపీ పార్టీలో చేరారు. టీడీపీలో వైస్సార్సీపీ నేతలు చేరడం ఆ పార్టీలో కలకలం రేపింది.