నేడు నగరంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కెటిఆర్‌ శంకుస్థాపన

minister-ktr

హైదరాబాద్‌ః ఈరోజు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కెటిఆర్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మొదటగా మూసీ నదిపై నిర్మించే వంతెనలకు శంకుస్థాపన చేయనున్నారు. పీర్జాదిగూడలో మూసీపై నిర్మించే వంతెనకు, ఉప్పల్ శిల్పారామం వద్ద, మూసారాంబాగ్‌లో మూసీ నదిపై నిర్మించే వంతెనకు శంకుస్థాపన చేస్తారు.

ఆ తర్వాత దుర్గం చెరువు వద్ద ఎస్టీపీని, మ్యూజికల్ ఫౌంటెన్‌ను మంత్రి కెటిఆర్​ ప్రారంభించనున్నారు. తెలంగాణలో బిఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్నన్ని రోజులు హైదరాబాద్ మహానగర అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని.. కెటిఆర్ సారథ్యంలోనే భాగ్యనగరం విశ్వనగంరా పేరుగాంచుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సుమారు 168 కోట్ల రూపాయల వ్యయంతో 5 వంతెనల నిర్మాణ పనులకు హెచ్ఎండీఏ ఇప్పటికే ఇంజినీరింగ్ ప్రోక్యూర్మెంట్, కన్​స్ట్రక్షన్ పద్ధతిలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసిందని తెలిపారు. ఈ వంతెనల నిర్మాణ పనులను 15 నెలల గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. వంతెనల నిర్మాణం వల్ల ప్రయాణం మరింత సులభంగా మారుతుందని వెల్లడించారు.