వైస్సార్సీపీ కి మరో షాక్ ..పిడుగురాళ్ల జడ్పీటీసీ జంగా వెంకట కోటయ్య రాజీనామా

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో వైసీపీ పార్టీ కి వరుస షాకులు తగులుతున్నాయి. వరుసపెట్టి ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు రాజీనామాలు చేసి టీడీపీ , జనసేన పార్టీలలో చేరగా..తాజాగా పిడుగురాళ్ల జడ్పీటీసీ జంగా వెంకట కోటయ్య వైస్సార్సీపీ కి రాజీనామా చేసారు. తన తండ్రి జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. రాజీనామా చేసినట్లు తెలుస్తుంది.

ఇక తనకు జడ్పీటీసీ పదవి కేవలం వైసీపీ వల్లే వచ్చిందని.. వైసీపీ పార్టీ వ్యవస్థాపకుల్లో తన తండ్రి, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి ఒకరని తెలిపారు. ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి ద్వారా తనకు జడ్పీటీసీ పదవి వచ్చిందని చెప్పడం హాస్యాస్పదమని జంగా వెంకట కోటయ్య ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గురజాల సీటును ఆశిస్తున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా కాసు మహేశ్ రెడ్డి ఉన్నారు. ఈయన కూడా మళ్లీ పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జంగాకృష్ణ మూర్తి కూడా ఆ సీటునే ఆశిస్తున్నారు. దీంతో జంగా కృష్ణమూర్తికి సీటు కష్టమేనని తేలిపోవడంతో ఆయన వర్గానికి చెందిన వాళ్లు రాజీనామాలు చేస్తున్నారు.