టీడీపీ నేత కోడెల శివరాం హౌస్ అరెస్ట్

అమరావతి: టీడీపీ నేత కోడెల శివరాంను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆయన ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. చంద్రన్న ఆశయ సాధన పేరుతో శనివారం పాదయాత్ర చేసేందుకు కోడెల శివరాం సిద్ధమయ్యారు. రాజుపాలెం నుంచి దేవరంపాడు కొండ వరకు పాదయాత్ర చేయాలని సంకల్పించారు.

అయితే పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో కోడెల ఇంటితోపాటు సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నేతల ఇళ్ల వద్ద కూడా పోలీసులు మోహరించారు. రాజుపాలెం మండలం టీడీపీ అధ్యక్షుడు అంచుల నరసింహారావును కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/