తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారులు శనివారం విడుదల చేశారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారులు పలు సార్లు భేటీలు నిర్వహించి ఈ షెడ్యూల్ ను ఖరారు చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీవరకు పరీక్షలను నిర్వహిస్తున్నట్లు బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యూకేషన్‌ డైరెక్టర్‌ తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని వెల్లడించారు.

తొలిరోజు అంటే మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు, కాంపోజిట్ కోర్సు) పరీక్ష ఉంటుంది. మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహిస్తారు. మార్చి 21న థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లిష్) పరీక్ష ఉంటుంది. మార్చి 23న మ్యాథమేటిక్స్ (గణితం), మార్చి 26న సైన్స్ పేపర్ 1 (ఫిజిక్స్), మార్చి 28న సైన్స్ పేపర్ 2 (బయోలజీ) నిర్వహిస్తారు. మార్చి 30న సోషల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్ 1న ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 (సంస్కతం, అరబిక్), ఎస్సెస్సీ ఒకేషనల్ కోర్సు (థియరీ) పరీక్షలు ఉంటాయి. ఏప్రిల్ 2న ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 (సంస్కృతం, అరబిక్) పరీక్షలు నిర్వహించబోతున్నట్లు షెడ్యూల్ విడుదల చేసారు. గతంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో మాల్ ప్రాక్టీస్, ప్రశ్నాపత్రాల నిర్వహణ విషయంలోనూ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది.