వైసీపీ 12వ జాబితా విడుదల..

ఏపీలో ఎన్నికల సమయడం సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ వరుస పెట్టి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేస్తూ వస్తుంది. ఇప్పటికే 11 జాబితాలను విడుదల చేసిన అధిష్టానం..మంగళవారం రాత్రి మరో జాబితాను రిలీజ్ చేసింది.

ఈ జాబితాలో కేవలం ఇద్దరు అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు. చిలకలూరిపేట ఇన్ఛార్జీగా కావటి మనోహర్ నాయుడు, గాజువాక ఇన్ఛార్జీగా గుడివాడ అమర్ నాథ్ పేరును ప్రకటించారు. మరోవైపు కర్నూలు మేయర్ గా బీసీ వర్గానికి చెందిన సి.సత్యనారాయణమ్మను నియమించినట్టు వైసీపీ ప్రకటించింది. ప్రస్తుతం ఆమె కర్నూలు 25వ వార్డు కార్పొరేటర్ గా ఉన్నారు.

ఇప్పటి వరకు విడుదలైన 11 జాబితాలలో 75 అసెంబ్లీ స్థానాలకు, 23 పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జీలను నియమించింది వైసీపీ. మొత్తం 175 సీట్లకు 175 సీట్లు మనమే గెలవాలని.. ఆ ప్రయత్నం చేద్దామని ఇప్పటికే వైసీపీ శ్రేణులకు సీఎం జగన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే.. పార్టీ బలంగా ఉండటం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తామని నేతలకు జగన్ స్పష్టం చేశారు.