మహిళ కదా అని తక్కువ చేసి మాట్లాడద్దని సజ్జల కు షర్మిల కౌంటర్

AP PCC చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన షర్మిల..బాధ్యతలు చేపట్టి చేపట్టగానే వైసీపీ సర్కార్ ఫై తీవ్ర స్థాయిలో మండిపడింది. అన్న అని కూడా చూడకుండా జగన్ రెడ్డి అంటూ ఏకవచనంతో సంబోదించి తన కోపాన్ని చూపించింది. షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల చేసిన కామెంట్స్ ఫై షర్మిల కౌంటర్ ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాకు ముఖ్యం.. నేను ఎవరు వదిలిన బాణం కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ పుట్టిన ఇల్లు.. తెలంగాణ మెట్టిన ఇళ్ళు అని తెలిపారు. కాగా.. ఏపీలో 175 స్థానాలు 25 ఎంపీ స్థానాలలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా.. 23 నుండి అన్ని జిల్లాల పర్యటన జరుగుతుందని పేర్కొన్నారు. 9 రోజులు రోజుకి మూడు జిల్లాల్లో పార్టీలో చేరికలు ఉంటాయన్నారు. కాగా.. ఈనెల 24 నుండి పోటీ చేసే అభ్యర్థుల నుండి అప్లికేషన్లు తీసుకుంటామని షర్మిల తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పుట్టిన ఇల్లు.. తెలంగాణ మెట్టిన ఇళ్ళు అని తెలిపారు. మహిళ కదా అని తక్కువ చేసి మాట్లాడద్దని ఈ సందర్బంగా సజ్జల కు హెచ్చరించింది.