మంత్రి కేటీఆర్ ఎడమ కాలికి గాయం..

రేపు పుట్టిన రోజు జరుపుకోబోతున్న వేళ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎడమ కాలికి గాయమై అభిమానులకు , కార్యకర్తలను బాధపెట్టింది. ఈరోజు నడుస్తుండగా..కిందపడడం తో కేటీఆర్ ఎడమ కాలి మడమకు గాయమైంది. దీంతో డాక్టర్స్ మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్నీ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ సమయంలో విలువైన ఓటీటీ షోలు చూడటానికి సలహా ఇస్తారా? అంటూ కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కోవడం విశేషం.
రేపు (జులై 24) మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్బంగా పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా జరిపేందుకు టిఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు , కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తుండగా..భారీ వర్షాల కారణంగా జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, పలు జిల్లాల్లో వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. వారికి పార్టీ శ్రేణులు తమకు తోచిన మేరకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం కింద సహాయం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు జన్మదిన సంబురాలకు బదులు స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.