నేడు రెండో రోజు జగన్ కడప జిల్లాలో పర్యటన

సీఎం జగన్ రెండో రోజు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళ్లు అర్పిస్తారు. అనంతరం నెమళ్ల పార్క్‌లోని ప్రేయర్ హాల్‌లో జరిగే క్రిస్మస్ వేడుకలకు హాజరుకానున్నారు. అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేత ప్రార్థనల్లో పాల్గొననున్నారు. ఆతర్వాత విజయ హోమ్స్ సమీపంలో నూతనంగా నిర్మించిన రింగ్ రోడ్డును ప్రారంభించనున్నారు. అనంతరం పులివెందుల కదిరి రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే పాత కూరగాయల మార్కెట్ స్థానంలో నూతనంగా అత్యాధునికంగా నిర్మించిన కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించనున్నారు.

మైత్రి లే అవుట్ వద్ద నూతనంగా నిర్మించిన వైఎస్సార్ పార్క్‌ను ప్రారంభిస్తారు. అలాగే నూతన రాయలాపురం కేబుల్ బ్రిడ్జితో పాటు నూతనంగా ఆధునిక హంగులతో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఆర్టీసి ప్రాంగణంలో నిర్వహించే బహిరంగసభలో పాల్గొననున్నారు.


ఇక రాత్రికి ఇడుపులపాయలోనే సీఎం జగన్‌ బస చేయనున్నారు. ఇదిలా ఉంటే.. నిన్న జగన్‌మోహన్ రెడ్డి.. కడప జిల్లాలో ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. తన రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూనే.. రాష్ట్ర ప్రజలు అంటే తనకు ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు. ‘ఇదే నా రాష్ట్రం. 5 కోట్ల ప్రజలే నా కుటుంబం. ఏపీ ప్రజల సంక్షేమమే నా విధానం. నేను ప్రజలనే నమ్ముకున్నాను అని అన్నారు.