బాక్స్ ఆఫీస్ వద్ద వీరయ్య – వీర సింహ రెడ్డి కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే

సంక్రాంతి బరిలో వచ్చిన చిరంజీవి వాల్తేర్ వీరయ్య , బాలకృష్ణ వీర సింహ రెడ్డి చిత్రాలు సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. వాల్తేర్ వీరయ్య చిత్రాన్ని బాబీ డైరెక్ట్ చేయగా..వీర సింహ రెడ్డి చిత్రాన్ని గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసారు. ఇక ఈ రెండు చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించడం విశేషం.

ఇక ఈ రెండు చిత్రాల కలెక్షన్లు చూస్తే..5 రోజుల్లోనూ ‘వీర సింహా రెడ్డి’ నైజాంలో రూ. 13.67 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.55 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.16 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.96 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.20 కోట్లు, గుంటూరులో రూ. 5.30 కోట్లు, కృష్ణాలో రూ. 3.51 కోట్లు, నెల్లూరులో రూ. 2.18 కోట్లతో కలిపి.. రూ. 50.55 కోట్లు షేర్, రూ. 81.75 కోట్లు గ్రాస్ వసూలు రాబట్టింది.

4 రోజుల్లో వాల్తేర్ వీరయ్య.. నైజాంలో రూ. 20.31 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.36 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.15 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5.56 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.35 కోట్లు, గుంటూరులో రూ. 4.81 కోట్లు, కృష్ణాలో రూ. 4.12 కోట్లు, నెల్లూరులో రూ. 2.22 కోట్లతో కలిపి.. రూ. 58.88 కోట్లు షేర్, రూ. 95.60 కోట్లు గ్రాస్ వసూలు రాబట్టింది. ఓవరాల్ గా ఈ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకోవడం , కలెక్షన్ల వర్షం కురిపిస్తుండడం తో అభిమానులు , డిస్ట్రబ్యూటర్స్ , నిర్మాతలు ఇలా అంత హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.