భారత్‌ మొబైల్‌ తయారీ పరిశ్రమకు కొవిడ్‌ షాక్‌!

Mobile Industry
Mobile Industry

న్యూఢిల్లీ : భారత్‌లో హ్యాండ్‌ సెట్‌ తయారీ పరిశ్రమలు త్వరలో ఫోన్ల తయారీని నిలిపివేయనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా కరోనా ప్రభావంతో చైనా పరిశ్రమలు మూతపడిన సంగతి విది తమే. ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌ విడి భాగాలను వివిధ దేశాలు ఎగుమతి చేసే దేశాల్లో చైనా మొదటిస్థానంలో ఉంది. తాజా పరిస్థితుల్లో ఎక్కడిక్కడ పరిశ్రమలు మూతపడి ఉత్పత్తులు ఆగిపోయి, సరఫరా నిలిచిపోయింది. దీంతో వచ్చే వారం నుంచి స్మార్ట్‌ఫోన్‌ తయారీ పూర్తిగా క్షీణించే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జనవరి-మార్చి త్రైమాసికంలో 10-15శాతం విక్రయాలు పడిపోనున్నాయి. దీని ప్రభావం ఏప్రిల్‌ -జూన్‌ నెలల్లో విడుదల కావాల్సిన కొత్త ఫోన్లపై పడి అవి 4 నుంచి 5 వారాలు ఆలస్యంగా విడుదల అవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. యాపిల్‌ ఐఫోన్‌ అమెరికాదై నప్పటికీ దాని విడిభాగాలన్నీ కూడా చైనాలోనే తయారవుతాయి. ఈ ఫోన్లను ఏ దేశంలోనైనా విక్రయించాలంటే చైనా నుంచి సరఫరా ఆగి పోవడంతో ప్రస్తుతం ఉన్న నిల్వలు అయిపోయా యని రిటైలర్‌లు చెబుతున్నారు. కరోనా బాధితు ల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండడంతో చైనా ప్రభుత్వం పరిశ్రమల సెలవులను పొడిగించింది. దీంతో సరఫరా చెయిన్‌పై తీవ్ర ప్రభావం పడు తుందని షావొమీ ఇండియా అధికారులు వెల్లడిం చారు. ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. దీనిపై ఇండియా సెల్యూలార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసిఇఎ) చైర్మన్‌ పంకజ్‌ మొహిండ్రూ స్పందిస్తూ, పరిశ్రమల్లో ఉత్పత్తులు అయిపోవడం ప్రారంభమైందని, మరో వారం రోజులు ఇదే కొనసాగితే ఫోన్ల తయారీకి అంతరాయం ఏర్పడు తుందన్నారు. అయితే స్మార్ట్‌ ఫోన్లలో వాడే బ్యాటరీ, కెమెరా మాడ్యూల్స్‌ వియత్నంలో తయారవుతాయి. డిస్‌ప్లే, కరెక్టర్స్‌ అధిక భాగం చైనాలోనే తయారవుతాయి. చిప్‌లు తైవాన్‌లో తయారవు తున్నప్పటికీ, ఫైనల్‌గా చిప్‌ మార్కెట్లోకి రావాలంటే మాత్రం చివరి దశలో చైనాలో రూపొం దించాల్సిందే. ఫీచర్ల ఫోన్ల ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డు విడిభాగాలన్నీ చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. అందువల్ల వచ్చే మరికొన్ని నెలల్లో ఫోన్ల కొరత ఏర్పడ నుంది. ఇప్పటికే ఐఫోన్‌ 11, 11ప్రొలు స్టాక్‌ లేదని రిటైలర్‌లు చెబుతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/