గోరఖ్‌పూర్‌లో ‘హోలీ’ ఊరేగింపులకు నాయకత్వం వహించనున్న యోగి

Yogi Adityanath

గోర‌ఖ్ పూర్: గోర‌ఖ్ పూర్ లో జరిగే హోలికా ద‌హ‌న్ ఊరేగింపులో యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ పాల్గొన‌నున్నారు. శ‌నివారం భ‌గ‌వాన్ న‌ర్సింగ్ హోలీకోత్స‌వ్ శోభా యాత్ర‌కు నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. కాగా మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా యోగి గోర‌ఖ్ పూర్ చేరుకోనున్నారు. క‌రోనా మహమ్మారి కారణంగా, గత రెండేళ్లలో ఈ ఉత్స‌వాలు నిర్వహించలేదు. గోరక్ష్ పీఠం అధిపతి నర్సింహ శోభా యాత్ర సందర్భంగా అందరితో హోలీ శుభాకాంక్షలు పంచుకున్నారు.

మహంత్ దిగ్విజయ్‌నాథ్.. మహంత్ వైద్యనాథ్ తర్వాత, యోగి ఆదిత్యనాథ్ పీఠాన్ని సామాజిక సామరస్య దిశలో నడిపిస్తున్నారు. రాక్షస రాజు హిరణ్యకశ్యపుతో పోరాడిన లార్డ్ నర్సింహ పేరు మీద నర్సింహ శోభా యాత్ర, యోగి .. గురువు మహంత్ వైద్యనాథ్ .. పూర్వీకుడు మహంత్ దిగ్విజయనాథ్ ద్వారా 1945లో ప్రారంభించబడింది..అప్పటి నుండి ఈ వేడుక‌లో కొన‌సాగుతున్నాయని ఆలయ కార్యదర్శి ద్వారికా తివారీ తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/