నేడు గులాం నబీ ఆజాద్‌తో భేటీ కానున్న సోనియా గాంధీ

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి మొదలైంది. ఇప్పటికే ఆ పార్టీ సీడబ్ల్యూసీ మీటింగ్నిర్వహించగా.. బుధవారం జరిగిన జీ23 నేతల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. సీనియర్‌నేత గులామ్‌నబీ ఆజాద్ నివాసంలో జరిగిన ఈ భేటీలో పార్టీ బలోపేతంపై నేతలు తమ ప్రతిపాదనలు సూచించారు. అయితే తాజాగా కాంగ్రెస్ సీనియర్‌నేత గులాం నబీ ఆజాద్.. పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో గురువారం భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై జీ23 నేతలు బుధవారం నిర్వహించిన సమావేశంలో ప్రతిపాదించిన కొన్ని అంశాలను సోనియాకు వివరించనున్నారు ఆజాద్.
కాగా, ఈ డిమాండ్లపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రస్తావించిన అంశాలను, ప్రతిపాదనలను ఆజాద్ సోనియా గాంధీకి వివరించనున్నారు. అయితే గులాం నబీ ఆజాద్‌తో జరగనున్న భేటీలో సోనియా గాంధీతోపాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉంటారని తెలుస్తోంది. ఈ సమావేశం పై కాంగ్రెస్ శ్రేణుల్లో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/