జగన్ ఒక 420 అలానే సజ్జల 840: నారా లోకేష్

lokesh-comments-on-jagan-and-sajjala

అమరావతిః విజయనగరం జిల్లా రాజాంలో శంఖారావం బహిరంగ సభను నిర్వహించారు ఈ సమావేశంలో నారా లోకేష్ మాట్లాడారు రానున్న ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలని వైఎస్‌ఆర్‌సిపి చూస్తోందని అన్నారు. జగన్ ఒక 420 అలానే సజ్జల 840 అని ఫైర్ అయ్యారు. ఇక 420 జగన్ కి 840 సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారుడని ఒక్కటి పనికొచ్చే సలహా ఇవ్వరని ఎద్దేవా చేశారు. నారా లోకేష్ సజ్జల రామకృష్ణారెడ్డి సలహా మేరకు ఈ వైఎస్‌ఆర్‌సిపి దొంగ ఓట్లతో గెలవడానికి యత్నిస్తోందని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడింటికి మూడు స్థానాలు టిడిపి గెలిచిందని అన్నారు ఆ టైంలో సజ్జలు రామకృష్ణారెడ్డి అసలు వీళ్ళు మా ఓటర్లే కాదని అన్నారు అయితే ఆ సమయంలో ఆయన అలా ఎందుకన్నారో అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థం అవుతుందని నారా లోకేష్ అన్నారు.