అమరావతి రైతులకు మద్దతు తెలిపిన వైఎస్‌ఆర్‌సిపి ఎంపి

YCP-Mp-Lavu-Sri-Krishnadevaraya
YCP-Mp-Lavu-Sri-Krishnadevaraya

అమరావతి: రాజధానిని అమరావతిగానే కొనసాగించాలంటు రైతులు చేసున్న ఆందోళనలు 45 రోజుకు చేరుకున్నాయి. అయితే అమరావతి రైతులకు వైఎస్‌ఆర్‌సిపి ఎంపి సంఘీభావం ప్రకటించారు. శుక్రవారం మందడంలో జరిగిన రైతుల దీక్షకు నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. స్థానికులతో పాటు దీక్షలో కూర్చున్న ఆయన అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. కాగా ఎంపీ ప్రసంగిస్తున్న సమయంలో మందడం రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అమరావతికి అనుకూలమో కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని ప్రకటన చేసి.. ఆ తర్వాత తమతో ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అయితే రాజధాని రైతుల అభిప్రాయం కోసం త్వరలోనే కమిటీ పర్యటిస్తుందని.. వారికి తమ డిమాండ్లు చెప్పాలని సూచించారు కృష్ణదేవరాయలు. రైతులకు ఎలాంటి నష్టం జరగదని.. సీఎం జగన్ అందరికీ న్యాయం చేస్తారని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/