జమ్ముకశ్మీర్‌లో విరిగిపడిన భారీ కొండచరియ

Road cuts-off after massive landslide on Budhal Mahore Road in J&K

శ్రీనగర్‌: భారీగా కురుస్తున్న వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరి అయిన జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నది. అయితే ఇటీవలి వర్షాల వల్ల బాగా నానిపోయి ఉన్న కొండల పైనుంచి తరచూ కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇలా విరిగిపడిన కొండచరియలు రహదారులను మూసివేసి వాహనాల రాకపోకలకు అడ్డంకిగా మారుతున్నాయి. తాజాగా బుధాల్‌ మహోర్‌ రహదారిలో భారీ కొండచరియ విరిగిపడింది. రోడ్డు పక్కనే ఉన్న కొండ పైనుంచి ఓ భారీ గుండుతోపాటు దాని చుట్టు ఉన్న మట్టి, రాళ్లు ఒక్కసారిగా జారిపడ్డాయి. దాంతో ఆ ప్రాంతమంతా దట్టంగా దుమ్ములేసింది. ఈ దృశ్యాలను స్థానికులు తమ మొబైల్స్‌లో వీడియోలు తీశారు. ఓ వ్యక్తి ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది.కింది వీడియోలో ఆ కొండచరియ విరిగిపడుతున్న దృశ్యాలను మీరు కూడా వీక్షించవచ్చు.