అమరావతి ఎడారిలో లేదు

అభివృద్ధి చెందుతున్న ఆశతోనే ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాం

pattabhi ram kommareddy
pattabhi ram kommareddy

అమరావతి: విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని నిర్మాణానికి టిడిపి ప్రభుత్వ హయంలో అంకురార్పణ చేశామని, అభివృద్ధి చెందుతున్న ఆశతోనే ఆ రోజున ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగిందని టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌ ఊహించుకున్నట్లు అమరావతి అనేది ఏడారిలో లేదని విమర్శించారు. ఈ వాస్తవాన్ని సీఎం జగన్‌ దృష్టిలో పెట్టుకోవాలని పట్టాభి సూచించారు. బీసీజీ నివేదికపై ఆయన విమర్శలు చేశారు. అమరావతిలో ఉన్న ల్యాండ్‌ బ్యాంకు ద్వారా వచ్చిన ఆదాయంతోనే రాజధానికి నిధులు సమకూరుతాయని తాము చెబుతుంటే, కాదని వైఎస్సార్‌సిపి మంత్రులు అంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు సృష్టించిన సంపద ఉపయోగించుకుని రాజధాని నిర్మాణం చేయడం తెలియక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/