తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోంది: బాల్క సుమ‌న్

ఇప్పటి వరకు రైతులను బీజేపీ ముంచింది

హైదరాబాద్: తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడుగడుగునా అన్యాయం చేస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ముంచిన బీజేపీ… ఇప్పుడు సింగరేణి కార్మికులను ముంచేందుకు యత్నిస్తోందని అన్నారు. సింగరేణిలోని కోల్ బ్లాకులను వేలం వేయవద్దని మూడు రోజుల పాటు కార్మికులు సమ్మె చేసినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదని విమర్శించారు.

తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడని రాష్ట్ర బీజేపీ నేతలను ప్రజలు నిలదీయాలని అన్నారు. కోల్ బ్లాకుల వేలాన్ని ఆపాలని ప్రధాని మోడీ తో కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. కోల్ బ్లాకుల వేలాన్ని ఆపకపోతే బీజేపీ భరతం పడతామని హెచ్చరించారు. బీజేపీ ధోరణని తెలంగాణ ప్రజలంతా గమనించాలని అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/